కోస్తా ఆంధ్రకు తీవ్ర తుపాను హెచ్చరిక
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను " ఖైముఖ్" క్రమేణా బలపడుతోంది. ఇది మచిలీపట్నానికి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది శనివారం సాయంత్రంలోపు బాపట్ల కాకినాడల మధ్య మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రలోని అన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని, తీరం వెంబడి 85 కిలోమీటర్ల దూరంలో ప్రచండమైన గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. పూరిళ్లు, చెట్లు, విద్యుత్ టవర్లు, కమ్యూనికేషన్ టవర్లు కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అన్ని ఓడరేవుల్లో ప్రమాద సూచికలు ఎగురవేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications