చిరంజీవికి లేఖ రాశా, కానీ..: జోగయ్య
హైదరాబాద్: చిరంజీవికి తాను లేఖ రాసిన మాట వాస్తవమేనని, అయితే ప్రజారాజ్యం పార్టీ గాలి వీచడం లేదని తాను రాయలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య చెప్పారు. తాను చిరంజీవికి నేరుగా లేఖ రాశానని, ఒక కాపీ ఆయనకు చేరిందని, మరో కాపీ తన వద్ద ఉందని ఆయన వివరించారు. ఒక ప్రధాన పత్రికలో తన లేఖకు సంబంధించి వచ్చిన అంశాలన్నీ నిజం కాదని ఆయన చెప్పారు.
ఈ మధ్యాహ్నం తాను విలేకరుల సమావేశం పెట్టి తన లేఖ కాపీలను అందజేస్తానని ఆయన వివరించారు. పార్టీ వ్యవస్ధాగత వ్యవహారాలు సంతృప్తికరంగా లేవని తాను ప్రధానంగా చిరంజీవికి రాశానని జోగయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications