కెసిఆర్ పై చెన్నూరు పిఎస్ లో కేసు
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. రోడ్ షోలపై హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన తర్వాత చంద్రశేఖర రావు రోడ్ షో నిర్వహించారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. మంగళవారం ఆదిలాబాదు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు వెలువడిన సమయంలో చంద్రశేఖరరావు చెన్నూరులో రోడ్ షో నిర్వహిస్తున్నారు.
రోడ్ షోలపై దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషన్ పై హైకోర్టు రాజకీయ పార్టీల రోడ్ షోలపై స్టే విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అంతకు కొద్ది రోజుల ముందు నుంచే కెసిఆర్ ఆదిలాబాద్ జిల్లాలో జైత్రయాత్ర పేరిట రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బుధవారం రోడ్ షోలను ఆపేసి ఆయన మంచిర్యాలలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభతో ఆయన తన పర్యటనను ముగిస్తున్నారు.












Click it and Unblock the Notifications