వైయస్ వి కారుకూతలు: కెసిఆర్

K Chandrasekhar Rao
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అక్కరలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, మంత్రులు కారుకూతలు కూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దాడుతానని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్పీ వరకు ఎవరితోనైనా కలుస్తానని ఆయన బుధవారం మంచిర్యాలలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జలయజ్ఞం వల్ల తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, తెలంగాణలో ఒక ఎకరాకు కూడా అదనంగా నీరందలేదని ఆయన చెప్పారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. గతంలో కన్నా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తెలంగాణకు ఎక్కువగా అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.

తెలంగాణపై ముప్పేట దాడి జరుగుతోందని, నిధులు, వనరులు, భూములు దోపిడీకి గురవుతున్నాయని ఆయన అన్నారు. అభివృద్ధి అడ్వర్జయిజ్ మెంట్లలోనే కనిపిస్తోందని, ఆచరణలో జరిగిందేమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చేసిందేమిటి, ఒరిగిందేమిటని ఆయన అడిగారు. తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పార్టీల గొంతు నొక్కడానికే రోడ్ షోలపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయించిందని ఆయన విమర్శించారు. ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టు ప్రభుత్వం చేస్తున్న దగాల్లో మరోటి అని ఆయన అన్నారు. కమీషన్ల కోసమే దీనికి టెండర్లు పిలుస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+