24 గంటల పాటు కరెంట్ కొరత
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి బుధవారం భారీగా గండి పడింది. రామగుండం, కొత్తగూడెం థర్మల్ విద్యుత్తు కేంద్రాలలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.బుధవారం వివిధ విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయిందని, దీని మూలంగా మొత్తం 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపపోయిందని ట్రాన్స్‌కో తెలిపింది.ఇదికాక సెంట్రల్ గ్రిడ్‌నుంచి రావలసిన విద్యుత్‌లో కూడా భారీగా కోత పడింది. ఒరిస్సాలోని తాల్చేరునుంచి 200 మెగావాట్లు, తమిళనాడులోని నైవేలీనుంచి 340 మెగావాట్లు, కర్ణాటకలోని కైగానుంచి 70 మెగావాట్లు రాష్ట్రానికి రావలసిన విద్యుత్ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో వచ్చే 24 గంటలపాటు రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉంటుందని ట్రాన్స్‌కో తెలిపింది.












Click it and Unblock the Notifications