వచ్చే నెల 11 నుంచి ఆర్టీసి సమ్మె
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మళ్లీ సమ్మె సైరన్ మోగుతోంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణం స్పందిచాలని కోరిన కార్మికసంఘాల నాయకులతో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ రెడ్డి రెండుసార్లు చర్చలు జరిపారు. సెట్విన్ బస్సులకు అనుమతి ఇవ్వరాదని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని తదితర డిమాండ్లతో వారు సమ్మె నోటీసు ఇచ్చారు.ప్రభుత్వ వైఖరితో సంతృప్తి చెందని గుర్తింపు పొందిన నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) నేతలు డిసెంబర్ 11,12 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు బుధవారం ప్రకటించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన డిసెంబర్ 3వ తేదీన రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. రెండు రోజుల సమ్మె తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఎన్ఎంయు నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం 1500 సెట్విన్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. దీని వల్ల ఆర్టీసికి నష్టం వాటిల్లుతుందని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి












Click it and Unblock the Notifications