గవర్నరుకు దేశ్ ముఖ్ రాజీనామా
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ తన రాజీనామా లేఖను గురువారం ఉదయం రాష్ట్ర గవర్నర్ కు పంపారు. తన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం ఆమోదించటంతో ఆయనతన రాజీనామాను గవర్నర్‌కు పంపారు. ముంబయి పేలుళ్ల నేపథ్యంలో వివాదాలు రేగటం, అన్ని రాజకీయపక్షాలు ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేయటంతో అయిదురోజుల క్రితం విలాస్‌రావు తన రాజీనామా లేఖను మొదట పార్టీ అధ్యక్షురాలికి పంపారు. బుధవారం దానికి పార్టీ అధిష్టానవరంగ ఆమోదం లభించింది.
విలాస్ రావు దేశ్ ముఖ్ వారసుని ఎంపిక గురువారం జరుగుతుంది. ఇందుకు సహకరించడానికి కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ ముంబయి వస్తున్నారు. సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చౌహాన్, అశోక్ చౌహాన్, నారాయణ రాణే ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. ఎన్సీపి నేత శరద్ పవార్ కుడా ముంబయికి వస్తున్నారు. ఆర్ ఆర్ పాటిల్ స్థానంలో ఉప మఖ్యమంత్రి పదవికి ఎన్సీపి తమ నేతను ఎన్నుకుంటుంది. ఉప ముఖ్యమంత్రి పదవి ఛగన్ బుజ్ భల్ కు దక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications