నిరూపిస్తే రాజీనామా: జానారెడ్డి

Jana Reddy
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా వటోలీ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని హోం మంత్రి కె. జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడును సవాల్ చేశారు. గురువారం శాసనసభలో ఆక్టోపస్ పై ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన సుదీర్ఘ చర్చలో జానారెడ్డికి, చంద్రబాబుకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వటోలీలో ఆరుగురు సజీవ దహనమైతే బాధ్యతారహితంగా ప్రభుత్వం ప్రకటన చేసిందని, షార్ట్ సర్క్యూట్ వల్లనే ఆ సంఘటన జరిగిందని చంద్రబాబు విమర్శించారు. దీనికి ప్రతిస్పందిస్తూ తాను ఆ విధమైన ప్రకటన చేసినట్లు మధ్యాహ్నం ఒంటి గంట లోపల నిరూపించాలని, అది నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని జానారెడ్డి అన్నారు.

షార్ట్ సర్క్యూట్ వల్లనే ఆ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో చెప్పిన మాట వాస్తవమని, ఈ విషయాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు అన్నారు. ఒక సందర్భంలో తనపై నక్సలైట్ల దాడి జరిగిన విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు తమపై విమర్శలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతుల్లో హతమయ్యారని, తనపై నక్సలైట్లు దాడి చేశారని, నక్సలైట్లతో తనకు విరోధం లేదని, ప్రజల ఆస్తులను, ప్రాణాలను కాపాడడంలో తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టిన విషయానికి అది నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలంటే ముఖ్యమంత్రికి నవ్వులాటగా ఉందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+