చెన్నా నా పేరు చెప్పలేదు: వైయస్

తన తండ్రిని చంపినవారిపై, తనపై దాడి చేసినవారిపై తాను ప్రతీకార చర్యలకు పూనుకోలేదని, తమది అటువంటి సంప్రదాయమని ఆయన అన్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితులను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారని, నిందితుడిని తనపై పోటీకి దించారని ఆయన అన్నారు. తనపై చంద్రబాబు 1996 ఎన్నికల సందర్భంగా 26 కేసులు పెట్టించారని ఆయన అన్నారు. తమది ఫ్యాక్షనిస్టు ధోరణా, అవతలి వాళ్లదా అని ఆయన ప్రశ్నించారు. అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేస్తే తాము విమర్శలు చేశామా, రాజకీయం చేయడానికి ప్రయత్నించామా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రిపై దాడి చేసే స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉందని, ఇప్పుడు నక్సలిజం చాలా వరకు తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. తీవ్రవాద సమస్యను పరిష్కరించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications