సినీ దర్శకుడు కొమ్మినేని కన్నుమూత

చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తికి ఈయన సోదరుడు. ఆయన గుంటూరు జిల్లా స్వగ్రామం తెనాలి సమీపంలోని పొన్నెకల్లు. ఆయన ఆసక్తితో అనేక సినిమాల్లో నటించారు. మొదట్లో విలన్‌గా ఆయన నటించారు. కంచుకంఠంతో ఆయన చెప్పే డైలాగులు ఆయనకు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి.

ఆ తరువాత ఆయన గిరిబాబు హీరోగా నటించిన దేవతలారా దీవించండి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ విజయం తరువాత సింహగర్జన సినిమాకు, ఆ తరువాత తాయారమ్మ-బంగారయ్య సినిమాకు దర్శకత్వం వహించారు. తాయారమ్మ,బంగారయ్య సినిమాను తమిళంలో శివాజీగణేశన్‌తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. కన్నడంలో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. మొత్తం 28 సినిమాలు నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+