చెన్నై: మెగాస్టార్ చిరంజీవి పార్టీ "ప్రజారాజ్యం" పార్టీ తరఫున తాను ప్రచారం చేయడానికి తాను సిద్ధమని ప్రముఖ నటి, రాడాన్ మీడియా యజమాని రాధిక చెప్పారు. తనకు చిరంజీవి కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉందని, ఆయన మంచి నటుడే గాక మంచి మనిషి కూడా అని ఆమె కితాబు ఇచ్చారు. చిరంజీవి వంటి వారు రాజకీయాల్లో రాణించి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయ పడ్డారు.
"న్యాయం కావాలి", "దొంగ మొగుడు", "జ్వాల", "అభిలాష" వంటి అనేక హిట్ చిత్రాల్లో చిరంజీవి, రాధిక నటించారు. చిరంజీవి హీరోగా ఎదుగుతున్న దశలో వీరిద్దరి కాంబినేషన్ లో ఆనేక హిట్, సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.