జనవరిలో జూ. ఎన్టీఆర్ పర్యటన

Jr Ntr
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర పర్యటన వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ఆయన తన రాజకీయ కార్యక్రమానికి కోస్తా జిల్లాల నుంచి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ పర్యటన కచ్చితంగా ఏ ప్రాంతం నుంచి మొదలవుతుందీ, ప్రచార వ్యూహం ఏమిటి అనే విషయాలు తెలియడం లేదు.

కాగా, నందమూరి బాలకృష్ణ రాష్ట్ర పర్యటన కూడా ఖరారయ్యే అవకాశాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పర్యటనకన్నా ముందే బాలకృష్ణ పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఆయన పర్యటన రాయలసీమ జిల్లాల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన బాలయ్య ఈ విషయమై చంద్రబాబుతో మాట్లాడినట్లు చెబుతున్నారు. కాగా, ఈ నెల 13వ తేదీన జరిగే తెలుగుదేశం పార్టీ మేధోమథనం కార్యక్రమంలో ఈ ఇద్దరు హీరోల పర్యటనలు ఖరారయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+