అనంతపురం: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈ రోజు( శనివారం) పుట్టపర్తి విచ్చేశారు. బాబా ఆశీర్వాదం తీసుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబ్లీపై జరుగుతున్న రభస గురించి విలేకరులు ప్రశ్నించగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం సంగతే తనకు తెలియదన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే తాము వ్యవహరిస్తామని ఆయన అన్నారు.