నేపాలీ నటితో శక్తి కపూర్ అసభ్య ప్రవర్తన

ఆ వార్తా కథనం ప్రకారం - కోక్ ఉందా అని శక్తి కపూర్ థాపాను అడిగాడు. ఆమె చెప్పలేనని జవాబివ్వడంతో తిట్టు పదం ప్రయోగించడమే కాకుండా ఆమె చేతిని పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన థాపా అతనిపై విరుచుకుపడింది. ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఇదే సినిమాలో నటిస్తున్న మరో భారత నటుడు షాబాజ్ ఖాన్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను సినిమాను వదులుకుంటానని థాపా బెదిరించింది. దీంతో కపూర్ ఆమెకు క్షమాపణ చెప్పాడు.
ఆ విధమైన సంఘటన జరిగినట్లు తనకు తెలియదని సినిమా దర్శకుడు సానూ శాఖ్యా అన్నారు. ఈ విషయమై సంప్రదించగా థాపా అందుబాటులో లేదని ఆ పత్రిక రాసింది. శక్తి కపూర్ మంగళవారమే ముంబైకి వెళ్లి పోయారని సానూ శాఖ్యా చెప్పారు. సినిమా షూటింగ్ కు ఏ విధమైన అంతరాయం ఏర్పడలేదని డైరెక్టర్ చెప్పారు. అయితే టాబ్లాయిడ్ వార్తా కథనంలో ఏ మేరకు వాస్తవం ఉందనే విషయాన్ని చెప్పలేం. ఇది వరకు రితిక్ రోషన్ విషయంలో ఈ పత్రిక తప్పుడు వార్తను రాసింది.












Click it and Unblock the Notifications