సోనియాతో మాల నేత జూపూడి భేటీ

న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పూనుకోవద్దని కోరడానికి మాల మహానాడు నేత జూపూడి ప్రభాకర రావు నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసింది. తమ డిమాండ్ కు సోనియా సానుకూలంగా ప్రతిస్పందించినట్లు జూపూడి ప్రభాకర్ చెప్పారు. తమ వాదనను సోనియా 7 నిమిషాల పాటు పార్లమెంటు సెంట్రల్ హాల్లో విన్నారని ఆయన చెప్పారు. తమ డిమాండ్ ను పరిశీలిస్తామని ఆమె చెప్పినట్లు ఆయన తెలిపారు.

దళితులంతా ఐక్యంగా ఉండాలని సోనియా తమతో అన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు ఓటు బ్యాంకుగా ఉన్న దళితులను బిజెపి, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చీల్చింది తాము సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు. దళితులంతా ఐక్యంగా ఉండి వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారం దిశగా పని చేయాలని, అంబేడ్కర్ స్ఫూర్తిని దెబ్బ తీయవద్దని ఆయన మాదిగలను కోరారు. దీక్ష విరమించి తమతో కలిసి పని చేయాలని ఆయన ఎమ్మార్పియస్ నేత మందకృష్ణ మాదిగను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+