వరంగల్: తన ప్రాణానికి ముప్పు ఉంటే అది కాంగ్రెస్ వల్లేనని వరంగల్‌లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ పాల్ ఆరోపించారు.అలాగే రాష్ట్రంలో పూర్తిగా ఫ్యాక్షన్ పాలనే సాగుతోందంటూ ఆయన విమర్శించారు. చర్చల పేరుతో నక్సలైట్లను, సాక్ష్యం చెబుతారని జైళ్లలో ఖైదీలను హతమారుస్తున్నారన్నారు. అవినీతి లేని రాజ్యం, ప్రజలకే అధికారం, ప్రజా అభివృద్దే ప్రజాశాంతి పార్టీ లక్ష్యమని పాల్ తెలిపారు. అవినీతిపై చర్చించేందుకు అన్ని పార్టీలు మీడియా ముందు చర్చకు రావాలని డిమాండ్ చేశారు.