జిల్లా జైలుకు 'అవినీతి చేప'
విజయవాడ: అక్రమాస్తుల ఆరోపణలతో సంచలనం సృష్టించిన మత్స్యశాఖ ఈ సూర్యనారాయణను ఏసీబీ అధికారులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనవి అక్రమ ఆస్తులు కాదని, తన ఆస్తులు అన్నిటికి లెక్కలు ఉన్నాయని అన్నారు. తనకు ఏ రాజకీయ నాయకులతోను సంబంధాలు లేవన్నారు. తన ఇంటిపై 1998లో కూడా ఏసీబీ అధికారులు దాడి చేశారని, అప్పుడు కూడా అన్నిటికి లెక్కలు చూపానని తెలిపారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించినందున పోలీసులు అతనిని జిల్లా జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications