పాక్ పై ఇండియా దాడి జరగవచ్చు
వాషింగ్టన్ : ముంబై ముట్టడి ఘటనలో పాక్, భారత సహనాన్ని పరీక్షిస్తోందని అమెరికా ఇంటలిజెన్స్ సంస్థ స్పష్టం చేస్తున్నది. ముంబై ముట్టడిలో పట్టుబడిన ఒకే ఒక్క ఉగ్రవాది కసబ్ అసలు తమ దేశ పౌరుడే కాదని పాక్ బుకాయిస్తుండడం తెలిసిందే. అంతర్జాతీయ సమాజానికి పాక్ చెప్పే కబుర్లన్నీ అవాస్తవమని ప్రస్ఫుటమవుతున్నా చేసేదేమీ లేకపోయింది. నిన్న నవాజ్ షరీఫ్ అధికార పార్టీ వైఖరిని తప్పు పట్టడంతో పాటు తాజాగా ఎఫ్‌బిఐ కూడా పాక్ ద్వంద్వ వైఖరిని తేటతెల్లడం చేసింది. దాంతో అమెరికా అధ్యక్షునికి ఎఫ్‌బిఐ సమర్పించిన నివేదికలో పాక్, భారత్ సహనాన్ని పరీక్షిస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. దీనితో భారత్ ఏ క్షణమైనా పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయవచ్చనీ వెల్లడించినట్లు తెలుస్తున్నది.












Click it and Unblock the Notifications