రాజమండ్రిలో బాలకృష్ణ 'రాజకీయం'

Balakrishna
రాజమండ్రి: యువరత్న బాలకృష్ణ బుధవారం రాజమండ్రికి వస్తున్న సందర్భంగా జిల్లాలో ఆయన అభిమానులతోపాటు టీడీపీ శ్రేణులు కూడా భారీస్థాయిలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేశారు. ఇటీవలే పూర్తిస్థాయిలో రాజకీయ అరంగేట్రం చేసిన బాలకృష్ణ ప్రధానంగా గోదావరి జిల్లాల రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని యోచిస్తున్నారు. నిన్న బాలకృష్ణ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. జనవరి మొదటి వారం నుంచి బాలకృష్ణ బహిరంగ సభలు నిర్వహించే అవకాశముంది.

ఇందులో భాగంగా షూటింగ్‌ నిమిత్తం రాజమండ్రిలో వారం రోజులపాటు ఉండే బాలయ్య టీడీపీ నేతలతో రాజకీయాలపై చర్చించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ప్రజారాజ్యం ప్రభావం నేపధ్యంలో జిల్లా నేతలతో తరచూ సంప్రదింపులు జరపాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు జిల్లాలో రాజకీయ పరిస్థితులు, నేతల పరిస్థితులపైనా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటు స్థానాల వారీగా రాజకీయ విశ్లేషణలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకుని అధ్యయనం చేసినట్టు సమాచారం. మొత్తంమీద బాలయ్య చర్చలతో జిల్లా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాలన్నది యోచనగా కన్పిస్తోంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రూపు విభేదాల జోలికి పోకుండా ఇక్కడ రాజకీయ చర్చలు జరపాలని బాలయ్య భావించినట్టు సమాచారం. అదే విధంగా జిల్లాలో వర్గ విభేదాలను చక్కబెట్టడానికి నేతలను సమన్వయం చేయడం వంటి వాటికి దూరమని ఇప్పటికే బాలకృష్ణ జిల్లా నేతలకు సంకేతాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+