హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఈ నెల 26 నుంచి రంగారెడ్డి, హైదరాబాదు నగర శివారు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు ఈ ప్రాంతంలో జరిగే బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు. జనవరి మొదటి వారంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాల సమాచారం. ఈనెల 26 నుంచే యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కరీంనగర్ జిల్లా నుంచి పర్యటన ప్రారంభించనున్నారు.