రాజమండ్రి: ప్రజారాజ్యం పార్టీ తొలిదశ మేనిఫెస్టో త్వరలో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మేధావులతో చర్చించి గ్రామస్వరాజ్యం, స్త్రీ సాధికారికతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. కమిటీల ఏర్పాటులో జాప్యంతోనే కొన్నిచోట్ల వివాదాలు చోటుచేసుకున్నాయని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కమిటీని వారంరోజుల్లో ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. తాను, పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని నాగబాబు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ సంస్ధాగత వ్యవహారాలపై నాగబాబు దృష్టి కేంద్రీకరిస్తున్నారు.