లాహోర్: అజ్మల్ కసబ్ మా వాడే నని రెండు రోజుల కిందట ప్రకటించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈరోజు మాట మార్చారు. అంతేగాక ముంబై దాడుల్లో పాల్గొన్నవారు పాక్ జాతీయులేననడానికి సరైన సాక్ష్యాలు చూపాలని ఆయన భారత్‌ను ఈరోజు డిమాండ్ చేశారు. పాక్‌పై నిరాధార ఆరోపణలు చేయడం మాని, బలమైన సాక్ష్యాధారాలు చూపాలని ఆయన భారత్‌కు సూచించారు. క్రిస్‌మస్ వేడుకల సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ శాంతిని ఆకాంక్షించే దేశమనీ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పాక్‌లో మైనారిటీలు స్వేచ్ఛగా, సంతోషంగా ఉన్నారని అన్నారు.