విరాళం ఇవ్వలేదని కొట్టి చంపేసారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పీడబ్ల్యుడీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని బీఎస్పీ కార్యకర్తలు కొట్టిచంపిన ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అరయ్యా జిల్లాలోని ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈరోజు ఉదయం ఇంజనీరు మనోజ్‌గుప్తా దగ్గరకు కొందరు బీఎస్పీ కార్యకర్తలు వచ్చారు. ఎమ్మెల్యే శేఖర్ తివారీ అనుచరులమని చెప్పిన వారు జనవరి 15న జరగనున్న ముఖ్యమంత్రి మాయావతి పుట్టినరోజుకు విరాళం అడిగారు. అందుకు నిరాకరించిన మనోజ్‌ను వారు తీవ్రంగా కొట్టటంతో ఆయన మృతి చెందారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications