'సత్యం'కు ప్రపంచబ్యాంక్ షాక్
హైదరాబాద్: డేటా చౌర్యం, ప్రాజెక్టుల కోసం బ్యాంకు సిబ్బందికి లంచాలు ఇవ్వడం.. వంటి ఆరోపణలపై సత్యం కంప్యూటర్స్‌ను ఎనిమిదేళ్ల పాటు తమతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించిన విషయం నిజమేనని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. మేటాస్ వ్యవహారంలో తీవ్ర దుమారాన్ని ఎదుర్కొంటున్న సత్యం కంప్యూటర్స్ సంస్థకు ఈ పరిణామం మరో శరాఘాతంలా తగిలింది.
ప్రపంచ బ్యాంకు ఐటీ ప్రాజెక్టులకు సంబంధించి కొద్ది నెలల క్రితమే సత్యం కంప్యూటర్స్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సత్యం కంప్యూటర్స్ ఈ వార్తలను ఖండించింది. ప్రపంచ బ్యాంకు కూడా మొదట్లో ధృవీకరించలేదు.
2004 తర్వాత ఒక కంపెనీకి వ్యతిరేకంగా ఎనిమిదేళ్ల నిషేధం వంటి కఠిన చర్యను ప్రపంచ బ్యాంకు ప్రకటించడం ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా మరోవైపు మేటాస్ వ్యవహారంలోని ప్రతికూల పవనాల కారణంగా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రామలింగరాజు తన పదవికి రాజీనామా చేసినట్టుగా వచ్చిన వార్తలు మంగళవారం నాడు మార్కెట్‌లో దుమారం సృష్టించాయి. సత్యం కంప్యూటర్స్ షేరు ధర 13.55 శాతం పతనంతో 140 రూపాయలకు చేరింది.












Click it and Unblock the Notifications