ఇలాగైతే రోడ్ షోలు వృధాయే
హైదరాబాద్: రోడ్‌షోలపై హైకోర్టు స్టే ఎత్తివేయటంతో రాజకీయపార్టీలు ముఖ్యంగా చిరంజీవి గాలి పీల్చుకున్నా వాస్తవానికి లోతుల్లోకి వెళితే దీని వల్ల ప్రయోజనం శూన్యం. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే రోడ్‌షోలు నిర్వహించాలని కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నిబంధనలు ఏమిటో డీజీపీ హైకోర్టుకు సమర్పించారు. ఆ మేరకు జాతీయ, రాష్ట్ర, పట్టణ ప్రధాన రహదారుల్లోర్యాలీలు, రోడ్‌షోలు అనుమతించరు.
ఈ ప్రాంతాల్లో మైకుల్లో మాట్లాడటం సైతం నిషేధం. నిషేధించిన రోడ్లలో ఇరువైపులా జన సమీకరణ ఉండకూడదు. పార్టీల కాన్వాయ్‌లో 10 కంటే ఎక్కువ వాహనాలు ఉండకూడదు. రోడ్‌షోలను జనసంచారం తక్కువ ఉండే చోట, ట్రాఫిక్ లేని బహిరంగప్రదేశాల్లో నిర్వహించాలి. రోడ్‌షోలు జరిగే చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆయా పార్టీలే చేయాలి...ఇలాంటి పలు నిబంధనలు ప్రభుత్వం తెలియజేసింది.
వీటికి అనుగుణంగా వ్యవహరించాలని కోర్టు కూడా అనటంతో ఇలా నిర్వహించాలంటే ఇకరోడ్‌షోలు నిర్వహించటమే అసాధ్యం. జనంలేని రోడ్‌షోలపై పార్టీలకూ ఆసక్తి ఉండదు. సందుల్లోను, వూరిబయట నిర్వహిస్తే అవి బహిరంగసభలు అవుతాయి తప్ప రోడ్‌షోలు కాదు. ప్రధానరోడ్లను నిషేధిస్తే ఇక రోడ్‌షోల పేరుకే అర్థం ఉండదు.












Click it and Unblock the Notifications