యాష్‌ట్రేకు ఎక్కువ..డస్ట్‌బిన్‌కు తక్కువ: రోజా
హైదరాబాద్: తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా ప్రజారాజ్యం పార్టీలో చేరిన టీడీపీ మాజీలు ని తీవ్రంగా విమర్శంచారు. వారు చిరంజీవినైనా నడిబజార్లో అమ్యేయగల సమర్దులని ఆమె అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ షరీఫ్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య యాష్‌ట్రేకు ఎక్కువ...డస్ట్‌బిన్‌కు తక్కువ అని అన్నారు. ఎప్పుడూ సొంత ఇమేజ్, పదవుల కోసమే ఆయన తాపత్రయపడ్డారని విమర్శించారు.
'తమకన్నా వేగంగా రంగులు మారుస్తున్న కోటగిరి విద్యాధరరావు, సి.రామచంద్రయ్య, తమ్మినేని సీతారాం, భూమా శోభ వంటివారిని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయి. రాజకీయాల్లో ఓనమాలు తెలియని పీఆర్పీలో చేరిన తర్వాత అక్కడ తమ ఉనికి కోసం రాజకీయ జన్మనిచ్చిన కన్నతల్లిలాంటి టీడీపీని తిడుతున్నారు. ఈ నేతలే టీడీపీలో ఉన్నప్పుడు పదవుల కోసం బాబును తెగ పొగిడారు. ఇప్పుడు చిరంజీవి ప్రాపకం కోసం బాబును తిడుతున్నారు' అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications