అది వాళ్లబ్బ సొమ్మా? పవన్

అలాగే తెలంగాణ విభజనను ప్రస్దావిస్తూ..."తెలంగాణ ఏర్పాటుపై అటు కాంగ్రెస్‌కు, ఇటు టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ నాన్చుతోంది. తెలంగాణ పేరిట టీఆర్‌ఎస్ రాజకీయ పబ్బం గడుపుకొంటోంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటే శరీరం. కానీ వేయి తలలు. అందుకే ఒక్కో తల ఒక్కో రకంగా మాట్లాడుతోంది. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌కు స్పష్టత, చిత్తశుద్ధి లేవు. అవే ఉంటే ఇంతకాలం నాన్చేది కాదు'' అని పవన్ కల్యాణ్ విమర్శించారు.
ఇదే అంశంపై కేసీఆర్ చిత్తసుద్దిని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా ఢిల్లీలో కూర్చున్న కేసీఆర్ ఏం చేశారు? జంతర్‌మంతర్ వద్ద నిరాహారదీక్షను ప్రారంభిస్తూ.. తెలంగాణపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానని ప్రగల్భాలు పలికిన ఆయన ఉద్యమాన్ని ఒక్కరోజుకే ఎందుకు అటకెక్కించారు? రాజకీయాలను వృత్తిగా చేసుకొనేందుకు చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించలేదు. దోపిడీపాలన నుంచి విముక్తి కల్పించి.. ప్రజలకు సుఖమయ జీవనం అందించాలన్న లక్ష్యంతోనే ప్రజారాజ్యాన్ని స్థాపించారు. ప్రజలారా మేల్కోండి.. దోపిడీరాజ్యం కావాలో.. ప్రజారాజ్యం కావాలో తేల్చుకోండి.''పీఆర్పీ మాత్రం మొదట్నించీ తెలంగాణపై స్పష్టంగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చొరవ చూపుతామన్నారు.












Click it and Unblock the Notifications