శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ ది డబ్బు పిచ్చి

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి డబ్బుపిచ్చి పట్టిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.రాష్ట్రంలో దోపిడీ చేసిన సొమ్మంతా ముఖ్యమంత్రి వైఎస్‌ ఇడుపులపాయలో దాచిపెడుతున్నారని, అక్కడ తవ్విస్తే లంకెబిందెలు దొరుకుతాయని ఆయన ద్వజమెత్తారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఆయన శ్రీకాకుళం ఆర్‌అండ్‌బి అతిధి గృహం వద్ద సోమవారం జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో వైఎస్‌ ప్రభుత్వ అక్రమాలపై తీవ్రపదజాలంతో విరుచుకుడ్డారు.

'రాజశేఖరరెడ్డి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయలేదు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి. భూగర్భ ఖనిజ సంపద ఎక్కడ ఉందో పరిశీలించడానికేనని' విమర్శించారు. వైఎస్‌ మంత్రిమండలిలో ఉన్న వారంతా ఒక్కో రకమైన అక్రమాల్లో కూరుకుపోయారన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కు వోక్స్ వ్యాగన్‌ కుంభకోణంలో హస్తం ఉందని బయటపడినా ఇంతవరకు చర్యలు లేకుండా మంత్రిగా కొనసాగిస్తున్నారన్నారు.

ప్రజల భూములకు కస్టోడియన్‌గా ఉండాల్సిన రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ జిల్లాలో రెండు చోట్ల భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపించారు. అలాగే ఇసుక కుంభకోణంలో ఇద్దరు మంత్రులు, సర్వశిక్షాభియాన్‌ కుంభకోణంలో సరసాదేవితో పాటు ముఖ్యమంత్రి అంగరక్షకుడు భాగస్వామిగా ఉన్నారని, ఎలుగుబంటి సూర్యనారాయణ అక్రమాల్లో ఆరుగురు మంత్రులు, చీఫ్‌ సెక్రటరీ, సత్యం, మైటాస్‌ కుంభకోణాల్లో ముఖ్యమంత్రి భాగస్వాములుగా ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఆయేషా, సింధూజ, స్వప్నిక వంటి విద్యార్థినుల హత్యలు, పిల్లల కిడ్నాప్‌ , పరిటాల రవి, మొద్దు శ్రీను హత్య లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు.ఇక వీటితో పాటే రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి దశ, దిశ లేకుండా పయనిస్తున్నారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X