విద్యార్ధిని గొంతు కోసిన రాక్షసుడు
ఒంగోలు: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థినిని గొంతుకోసి తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. క్లాస్‌రూంలోనే ఈ సంఘటన జరగటంతో విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. స్రవంతి అనే విద్యార్థినిపై దాడి చేసిన సహ విద్యార్థి రెండుమూడు సార్లు గొంతుపై బ్లేడుతో కోశాడు.
అంతా కేకలు వేయటంతో పారిపోయి అక్కడినుంచి భవనంపైకి ఎక్కి కిందకు దూకాడు. దీంతో అతనికి కాళ్లు, చేతులు విరిగాయి. యాజమాన్యం ఇద్దరినీ కందుకూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన విద్యార్థి పేరును యాజమాన్యం బయటపెట్టటం లేదు. దాడికి గురైన విద్యార్థిని పేరు స్రవంతి అని వీరు ఇరువురూ పక్కపక్క ఇళ్లలో ఉంటారని తెలిసింది. ప్రేమ వ్యవహారమే గొడవకు కారణమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications