హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డికి సమర్పించారు. శాసన మండలికి ఎన్నికయ్యేందుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రోశయ్య రాజీనామాను ఆమోదించి, ఆయన ఇప్పటిదాకా ప్రాతినిథ్యం వహిస్తోన్న ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీ పదవికి ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. తద్వారా కౌన్సిల్ నుంచి మంత్రి వర్గంలో కొనసాగనున్నారు.