హైదరాబాద్: బాలకృష్ణ గురువారం ఉదయం బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అనంతపురం జిల్లా హిందూపురం చేరుకున్నారు. బాలకృష్ణ రాజకీయ పర్యటన ఈరోజు అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ప్రారంభం అవుతోంది. ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు, టీడీపీకి ఆ నియోజకవర్గంతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా బాలకృష్ణ కూడా అక్కడినుంచే ప్రచారం ప్రారంభిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూపురం అంటేనే నందమూరి వూరు అని అన్నారు. అందుకే తాను కూడా అక్కడే మొదటి బహిరంగసభలో పాల్గొంటున్నానని అన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు.