సిబిఐ చేతికి చిక్కిన రా అధికారి
న్యూఢిల్లీ: రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధికారి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు దొరికిపోయారు. 'రా' అధికారి కె.ఎస్. రావు 8 లక్షల రూపాయల లంచం తీసకుంటుండగా సీబీఐ అధికారులు వలవేసి పట్టుకున్నారు. చెన్నైకి చెందిన ఉత్పత్తిదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా రాలోని సాంకేతిక విభాగంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్న ఎఎస్ నారాయణరావును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.
కరోల్ బాగ్ లోని ఒక హోటల్లో రావును సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఒక కంపెనీ ఎగుమతి లైసెన్సును క్లియర్ చేయడానికి రావు ఎనిమిది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రాకు చెందిన ఒక అధికారి ఈ రకంగా పట్టుబడడం ఇదే తొలిసారి. కంపెనీకి చెందిన పత్రాలను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications