హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు బహిరంగసభ ఈనెల 17 మెదక్ జిల్లా దుబ్బాకలో జరగనుంది. పదిహేడవ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక తెలంగాణ భవన్‌లో చేస్తున్న విశ్వశాంతి యాగం ఈనెల 16తో ముగుస్తుంది. అలాగే మధ్యలోనే రోడ్ షోలను ఆపివేసిన ఆయన మహాసభతోనే ఎన్నికల ప్రచారం సాగించనున్నట్లు తెలియవచ్చింది. మహాకూటమిలో చేరిన నేపథ్యంలొ మొదటిసారిగా దుబ్బాకలో సభకు కేసీఆర్ ఒప్పుకున్నట్లు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే అధికారికంగా కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.