హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే సంయుక్త సభా సంఘం ఏర్పాటు జరుగుతుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీ శుక్రవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉందని, మా చిత్త శుద్ధిని శంకిచాల్సిన అవసరం లేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సులభం చేసేందుకే ఈ కమిటీ నియామకమని మొయిలీ తెలిపారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సంఘం (పీసీసీ) తొలిసారిగా హైదరాబాద్, గాంధీభవన్‌లో శుక్రవారం జరగతున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశానికి వచ్చిన వీరప్ప మొయిలీ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.