కుప్పం కుంభకోణంపై దర్యాప్తు

ఎన్నికల వేళ చివరిసారిగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ నిర్ణయాల్లో భాగంగా, తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రతిష్టాత్మకంగా, ప్రయోగాత్మకంగా మొదలెట్టిన బిందుసేద్య కుంభకోణంపై సిబిసిఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కుప్పం బిందుసేద్యం ప్రాజెక్టులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హర్యానా రిటైర్డ్ జడ్జ్ చలపతితో కమిటి నియమించారు. ఈ కమిటి ఇటీవల ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించింది. ఈ నివేదికను యథాతథంగా ఆమోదించిన మంత్రి వర్గం కుప్పం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తునకు సిబిసిఐడినీ సిఫార్సు చేసింది.












Click it and Unblock the Notifications