హైదరాబాద్: ప్రతీ ఒక్కరూ సామాజికన్యాయం గురించి మాట్లాడుతున్నారని, దానిపై మాట్లాడే హక్కు ప్రజారాజ్యం పార్టీకి తప్ప మరే పార్టీకి లేదని పీఆర్పీ అధినేత చిరంజీవి స్పష్టం చేసారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు సామాజిక న్యాయం విషయంలో తమనే అనుసరిస్తున్నాయని తెలిపారు. అలాగే సామాజిక న్యాయం కేవలం తమ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బసవరాజు ఆధ్వర్యంలో కర్ణాటకకు చెందిన చిరంజీవి అభిమానులు ఈరోజు ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్న సందర్భంగా చిరు పై వ్యాఖ్యలు చేశారు.