న్యూఢిల్లీ: భారత చలన చిత్ర చరిత్రలో మొదటిసారిగా ఆస్కార్ అవార్డులు సాధించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్ర యూనిట్‌కు ఈరోజు పార్లమెంట్ ప్రశంసల జల్లు కురిపించింది. ప్రత్యేకించి ఏఆర్ రెహ్మాన్‌ను, రసూల్ పూకుట్టిలను, స్మైల్ పింకీ చిత్రంలో నటించిన పింకీకి ఆ చిత్ర యూనిట్‌ను సభ అభినందించింది. భారతీయులు గర్వపడేలా చేశారని ప్రశంసించారు. స్పీకర్ సోమనాథ్ చటర్జీ అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులంతా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఒక్కో పార్టీ తరపున ప్రతినిధులు మాట్లాడి అభినందించారు.