75 మంది'నిమ్స్'డాక్టర్ల రాజీనామా
హైదరాబాద్: ఈ రోజు (శుక్రవారం) 75 మంది నిమ్స్ వైద్యులు మూకుమ్మడి రాజీనామా చేశారు. తమ వేతనాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడ్డారు. ఈ పరిణామంతో అత్యవసర వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన రోగుల బాధలు కు ఏం చేయాలో అర్ధం కాని పరిస్ధితి నెలకొంది.
ఆరో వేతన సంఘం నియమిత సిఫార్సుల ద్వారా తమ వేతనాలు పెంచాలంటూ గత కొద్ది కాలంగా నిమ్స్ వైద్యులు ఆందోళన నిర్వహిస్తుండడం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చిన వాగ్థానాలు అమలుకి నోచుకోకపోవటంతో ఈ సంక్షోభం నెలకొంది. ఇదే వైద్యుల మూకుమ్మడి రాజీనామాలు కు దారితీసింది.












Click it and Unblock the Notifications