జింబాబ్వే ప్రధాని భార్య దుర్మరణం
హరారే: జింబాబ్వే ప్రధాని మోర్గాన్ స్వంగిరాయ్ భార్య సుసాన్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రధాని తన భార్యతో కలిసి సొంత వూరుకు కారులో వెళ్తుండగా ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రధానికూడా స్వల్పంగా గాయపడ్డారు. మూమెంట్ ఫర్ డెమొక్రటిక్ ఛేంజ్ నేత అయిన మోర్గాన్ గత నెలలోనే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్న ప్రధానిని దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పరామర్శించారు.












Click it and Unblock the Notifications