ముస్లింలను వైయస్ ఊచకోత: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: వైఎస్‌ కడప, బెజవాడల నుంచి రౌడీలను రప్పించి 400 మంది ముస్లింలను మత కల్లోల పేరిట ఊచకోత కోయించారని పీఆర్పీ అధినేత చిరంజీవి ఆరోపించారు. అధికారంలోకి రావడానికి ముస్లింలను వాడుకుంటూ, రాజకీయ స్వార్థానికి వారినే బలి చేస్తున్నారని చిరు ముఖ్యమంత్రి వైఎస్‌పై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి అప్పటి ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి ఈ విషయాన్ని శాసనసభలో ప్రస్తావించారని గుర్తుచేశారు.

గురువారం హైదరాబాద్‌లోని దారుషిఫా వద్ద జరిగిన ముస్లింల సామాజిక న్యాయసదస్సులో చిరంజీవి సీఎం వైఎస్‌, టీడీపీ అధినేత చంద్రబాబులపై విమర్శల వర్షం కురిపించారు. ఆదిలాబాద్‌ జిల్లా భైంసా, వటోలిలో గొడవలు జరుగుతాయని తెలిసీనప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నిప్పులు చెరిగారు.ఒక ముస్లిం కుటుంబాన్ని సజీవ దహనం చేస్తే ఇంత వరకు నిజాలు నిగ్గుతేల్చలేదని విమర్శించారు. బాబ్రీ మసీదు కూలగొడుతుంటే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకుందన్నారు. అధికారం కోసం ముస్లింలను వినియోగించుకొని, అధికారంలోకి రాగానే టీడీపీ ఎన్‌డీఏతో పొత్తుపెట్టుకుందని, గుజరాత్‌ మారణకాండలో వేలాది మంది ముస్లింలు చనిపోతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిందని ధ్వజమెత్తారు.

అందుకే గత ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము సూడో సెక్యులరిస్టులం కాదని వెల్లడించారు.రాష్ట్రంలో చరిత్రలో ఇప్పటి వరకు 396 మంది మంత్రులైతే, అందులో 24 మంది మాత్రమే ముస్లిం ఉన్నారని, ఇదేనా సామాజిక న్యాయం అంటూ టీడీపీ, కాంగ్రెస్‌లను నిలదీశారు. 'మీ భవిష్యత్తును నా చేతుల్లో పెట్టారు. మీకు మంచి చేసే అవకాశం అల్లా నాకిచ్చాడు' అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+