తిరుపతి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పధకం అధ్బుత పథకమని, దీనివల్ల చాలామంది పేదలకు కార్పోరేట్ వైద్యం అందుతోందని ప్రజారాజ్యం పార్టీ అధినేత అల్లుడు చిరంజీవి అల్లుడు శిరీష్ భరధ్వాజ్ పొగిడాడు. భరద్వాజ్ దంపతులు తిరమలలో సుప్రభాత విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భరద్వాజ్, శ్రీజలు మీడియాతో మాట్లాడారుతూ ప్రభుత్వ పధకాలను ప్రసంసించారు. అలాగే భరద్వాజ్ తనకూ రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉందంటూ వెళ్ళడించారు.ఇక శ్రీజ తన తండ్రి తప్పనిసరిగా సీఎం అవుతాడని ధీమా వ్యక్తం చేసింది.