రియాల్టీషో స్టార్ జేడ్‌గూడీ మృతి
లండన్: రియాల్టీషో ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన టీవీ స్టార్ జేడ్‌గూడీ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌లో నరకయాతన అనుభవించిన ఆమె శనివారం రాత్రి నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. 27 ఏళ్ల గూడీకి సర్వికల్ క్యాన్సర్ ఉన్నట్లు 2008లో నిర్థారించారు. అది శరీరంలోని ఇతర అవయవాలకు కూడాఈ వ్యాపించటంతో పరిస్థితి విషమించింది. లండన్‌లోని రాయల్ మార్స్‌డెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తుది రోజుల్లో ఉందని డాక్టర్లు చెప్పటంతో తన ఇంటిలోనే మరణించాలని ఆమె కోరుకున్నారు. దీంతో ఆమెను ఇంటికి తీసుకునివచ్చారు. ఇటీవల ఆమె గురించి రోజూ అక్కడి టీవీలో చూపుతున్నారు.
చివరి రోజుల్లో అనందంగా ఉండాలని భావించిన ఆమె ఫిబ్రవరిలో జాక్‌ట్వీడ్‌ను వివాహమాడారు. మొదట్లో నర్సుగా పనిచేసిన గూడీ అనంతరం మోడలింగ్‌రంగంలో అడుగుపెట్టారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన రియాల్టీషోలో భారతీయ నటి శిల్పాశెట్టిపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. అనంతరం క్షమాపణలు చెప్పారు. ఆ సంఘటన ఆమెకు, శిల్పకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. షో అనంతరం కొంతకాలానికి క్యాన్సర్ అని తేలటంతో ఆమె తన ఇద్దరు కుమారులకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తన పెళ్లి,అంత్యక్రియలు అన్నిటిని వ్యాపారంగా మార్చి హక్కులను అమ్మారు. మొత్తం డబ్బు కుమారులపేర రాశారు. చివరిరోజుల్లో ఎంతో ధైర్యం కనబరచారు.












Click it and Unblock the Notifications