కుప్వారా ఎన్‌కౌంటర్: 25 మంది మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కొనసాగిన భీకర పోరు ఎట్టకేలకు ముగిసింది. ఎదురుకాల్పుల్లో 17మంది తీవ్రవాదులు, 8మంది సైనికులు మృతి చెందినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి జేఎస్ బ్రార్ తెలిపారు. ఈనెల 20నుంచి ఈ ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం మీద 25మంది మృతిచెందారు. ఇటీవలి కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇంతమంది మరణించటం ఇదే మొదటిసారి.
నిఘా విభాగాల సమాచారం మేరకు తాము ఆపరేషన్ చేపట్టామని బ్రార్ చెప్పారు. సోమవారం నాడు నలుగురు సైనికులు, ఐదుగురు మిలిటెంట్లు మరణించారు. అంతకు ముందు రోజు ఒక మిలిటెంట్ మరణించారు. శనివారంనాడు మేజర్ మోహిత్ సేన్ తో పాటు ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. పాకిస్తాన్, భారత సైనికుల మధ్య కాల్పులతో ఈ ఎన్ కౌంటర్ యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో ఒక భారత సైనికుడు గాయపడ్డాడు.
More From
-
2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications