అస్సాంలో పత్రికా ఎడిటర్ కాల్చివేత
గౌహతి: అస్సామ్ లో స్థానిక దినపత్రిక అజీ ఎడిటర్ ఇన్ చీఫ్ అనిల్ మజుందార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. రాయిఘర్ రోడ్డులోని ఆయన నివాసం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గత రాత్రి కార్యాలయంనుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన లోపలికి వెళ్లేందుకు గేటు తీస్తుండగా ఏడుగురు సాయుధులైన వ్యక్తులు ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు.
7 బుల్లెట్లు ఆయన ఛాతిలో దూసుకుపోయాయి. 40 ఏళ్ల అనిల్‌కు నిర్భయంగా పనిచేసే జర్నలిస్టుగా పేరుంది. ఉల్ఫాకు, ప్రభుత్వానికి మధ్య చర్చలకు అనుకూలంగా అనేక వార్తలు, వ్యాసాలు రాశారు. అస్సాంలో గత ఆరేళ్లలో 22మందికి పైగా జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అనిల్ మృతి రాష్ట్రంలోని మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది.












Click it and Unblock the Notifications