హైదరాబాద్: మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య సీట్ల సర్దుబాటు సజావుగా జరిగిపోయింది. తెలుగుదేశం, తెరాసల మధ్య సీట్ల సర్దుబాటులో ఏర్పడిన ప్రతిష్టంభన మంగళవారం రాత్రి హైడ్రామా మధ్య పూర్తయింది.తెరాసకు 9 పార్లమెంటు సీట్లు, 43 శాసనసభా సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. మంగళవారనాడు ఇరు పార్టీల మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి.
సిపిఐకి 16 అసెంబ్లీ స్థానాలు, 2 లోకసభ స్థానాలను, సిపిఎంకు 16 శాసనసభా స్థానాలను, రెండు లోకసభ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. సీట్ల సర్దుబాటులో గత కొద్ది కాలంగా మహా కూటమి నేతల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది.