రైలు బండి గుర్తుపై చిరంజీవి హర్షం
రైలు బండి గుర్తుపై చిరంజీవి హర్షం జగ్గంపేట: ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు రావడం ఆ పార్టీ అధినేత చిరంజీవి హర్షం ప్రకటించారు.శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాఅకింత యాత్రలో పాల్గొన్న చిరంజీవి ఉమ్మడి గుర్తు రావడంపై స్పందించారు. చాలా మంది ఉమ్మడి గుర్తు రాదని అన్నారని, తమకు మాత్రం ఆ విశ్వాసం ఉందని, తమ నమ్మకం వమ్ము కాలేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని, ఉగాది రోజు కామన్‌సింబల్ లభించడం సంతోషదాయకం అని ఆయన అన్నారు. తమకు ప్రజాబలం వల్లే ఉమ్మడి గుర్తు వచ్చిందని చిరు చెప్పారు.












Click it and Unblock the Notifications