చిరు పార్టీకి 'రైలింజన్', ఉగాది కానుక
న్యూఢిల్లీ: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి వారు కోరుకున్న రైలింజన్ గుర్తు లభించింది. ఉమ్మడి గుర్తులు కేటాయించాలంటూ ప్రజారాజ్యం, లోక్ సత్తా తదితర కొత్త పార్టీలు వేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఆయా పార్టీలకు వారు కోరుకున్న గుర్తులను కేటాయించవలసిందిగా ఎన్నికల సంఘాన్ని నేడు ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం ప్రజారాజ్యంకు రైలింజన్, లోక్ సత్తాకు విజిల్ గుర్తులు లభిస్తాయి. ఈ పార్టీలు పోటీ చేయని స్ధానాల్లో ఇండిపెండెంట్లకు ఆ గుర్తులు కేటాయించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
గుర్తింపు లేని పార్టీలకు ఉమ్మడి గుర్తును కేటాయించడం కుదరదని ఎన్నికల సంఘం హైకోర్టులో తన వాదనను విన్పించింది. కానీ నేటి సుప్రీంకోర్టు తీర్పు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి, జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీకి ఉగాది వరం వంటిది. మరీ ముఖ్యంగా చిరంజీవి అభ్యర్ధులలో ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్ధులందరికీ రైలింజన్ గుర్తు లభిస్తే ప్రజారాజ్యం సునామీలా దూసుకెళ్ళే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications