బాబుతో హీరో కృష్ణ మంతనాలు!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి కృష్ణ గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తన సోదరుడు ఆదిశేషగిరిరావుకు లోక్‌సభ సీటు కేటాయించకపోవడంతో కినుక వహించిన ఆయన, వైఎస్ నచ్చజెప్పడంతో కాస్త వెనక్కుతగ్గారు. అయితే తాజా రాష్ట్ర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కృష్ణ తన మనసు మార్చుకున్నట్లు సమాచారం. దీనితో, చంద్రబాబుతో కృష్ణ తన సోదరునికి లోక్‌సభ సీటు కేటాయించే విషయమై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా విజయనిర్మలకు కైకలూరు సీటు కోరుతున్నట్లుగానూ సమాచారం. ముందు నుంచీ కృష్ణ చేరిక పట్ల ఆసక్తి చూపుతున్న తెలుగుదేశం పార్టీ వీరి కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నది. ఉOడవల్లికి చెక్ చెప్పేందుకు మురళీమోహన్‌ను జూబ్లిహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి రాజమండ్రి లోక్‌సభ స్థానానికి బలవంతంగా ఒప్పించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ స్థానాన్ని ఆదిశేషగిరిరావుకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అది వీలుకాకపోతే గుంటూరు లోక్‌సభ స్థానాన్ని కృష్ణ కుటుంబానికి ఇచ్చే పరిశీలన కూడా జరుగుతున్నది.












Click it and Unblock the Notifications