కసబ్ కు లాయర్ దొరికారు

ముంబై: ముంబై దాడుల ఘటనలోని నిందితుడు మొహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ కు న్యాయవాది దొరికాడు. దీంతో ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఆర్థర్ రోడ్ జైల్లోని స్పెషల్ హై సెక్యూరిటీ కోర్టులో విచారణ ప్రారంభం కానుంది. నిరుడు నవంబర్ 26వ ముంబైలో దాడులు చేసిన ఉగ్రవాదుల్లో కసబ్ పట్టుబడిన విషయం తెలిసిందే. కసబ్ తరఫున వాదించడానికి మహారాష్ట్ర సర్వీస్ లీగల్ అథారిటీ న్యాయవాది అంజలి వాఘ్ మారేను నియమితులయ్యారు.

వాఘ్ మారే నియమితులైన విషయాన్ని న్యాయమూర్తి ఎంఎల్ తహిలియానీ కసబ్ కు తెలియజేశారు. కసబ్ కు ఆమె సహకరిస్తుందని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా కసబ్ ను కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఆర్థర్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కసబ్ ను విచారించారు. చార్జిషీట్ ను న్యాయవాది చదివి వినిపిస్తారని కోర్టు కసబ్ కు తెలియజేసింది. తనకు వార్తా పత్రికలు కావాలని కసబ్ కోర్టును కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+