ఎపి ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: ర్యాగింగ్ సంఘటనపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ర్యాగింగ్ వల్ల ఒక విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన సంఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ పై ఎందుకు క్రిమినల్ కేసు పెట్టలేదని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల బాపట్ల వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కు మనస్తాపానికి గురైన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

ర్యాగింగ్ వల్ల విద్యార్థి మరణించిన సంఘటనకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో గల రాజేంద్ర ప్రసాద్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని న్యాయమూర్తులు అరిజిత్ పసాయత్, అశోక్ కుమార్ గంగూలీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. రెండు ర్యాగింగ్ సంఘటనలపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం వేసిన దరఖాస్తుపై సుప్రీంకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+